kvk4
అంతర్జాల మిత్రుల ద్వారా అందరికీ ఒక ముఖ్య ప్రకటన. సంస్కృత కళాలల పరిక్షణకూ, ప్రాచీన భాషా సంరక్షణకూ చేపట్టిన భాషా ఉద్యమం మహోగ్రరూపం దాల్చిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ఎంతో మంది తమ ఆశీర్వాదాలు, అభినందనలూ పంపుతూ ఉండగా, అదే స్థాయిలో దీనిని మొగ్గ దశలోనే అణిచివేయడానికి ప్రయత్నాలూ ముమ్మరం అయ్యాయి. భౌతిక దాడులు చేస్తామనే బెదిరింపులు దగ్గర నుంచీ కోర్టు కేసుల వరకూ అనేక రకాల బెదిరింపులు చేస్తున్న సందర్భంలో కొంత మంది నిపుణుల సలహా మేరకు ఈ ప్రకటన చేయాల్సి వస్తోంది.
1) నా పేరు: ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం. తండ్రిపేరు: స్వర్గీయ ఏలూరిపాటి అనంతరామయ్యగారు. చిరునామా: 16-1-24/c/6/1; F2 Sri Sai Apartments, Saidabad colony, Hyderabad- 500059. వృత్తి: పాత్రికేయుడు. విద్యార్హతలు: ఎంఫిల్ జర్నలిజం. మొబైల్: 9247821505.
2)నేను సామాజిక మాధ్యమాలలో నా గళాన్ని వినిపిస్తున్న కేంద్రాలు ఇవి మాత్రమే.
http://anantasahiti.org/
https://yeluripati.wordpress.com
https://www.facebook.com/yeluripati
నేను నిర్వహిస్తున్న బృందాలు ఇవి మాత్రమే:
https://www.facebook.com/groups/anantasahiti/
https://www.facebook.com/groups/cancerpcc/

https://www.facebook.com/groups/sanskrit.saviours/
నేను నిర్వహిస్తున్న పేజీ:
https://www.facebook.com/namochandraa

https://www.facebook.com/pages/Save-Dr-Kolachala-Venkata-Krishna-Murty-Sanskrit-College/401438553387703

పై వాటిలో నేను చేసే ప్రకటనలు, ప్రచురణలకు సంపూర్తి బాధ్యత వహిస్తున్నాను. వాటిలో ఇతరులు వ్యక్తం చేసే వ్యాఖ్యలు ఎవరికైనా అభ్యంతరం ఉన్న పక్షంలో yvrsubrahmanyam@hotmail.com కి తెలియ చేయమని కోరుతున్నాను. వాటిని తొలగించడానికి ఎట్టి అభ్యంతరం లేదు.
3) సంస్కృత భాషా పరివ్యాప్తికి, పరిపుష్టికీ ఎవరైనా తమ వంతు ప్రచారం చేయదలిస్తే దయచేసి యథాతథంగా వీటిని షేర్ చేయమని కోరుతున్నాను. మొత్తం షేర్ చేయడం ఇష్టం లేనివారు తమకు నచ్చిన భాగాలు తీసుకుని వాటిని ఎక్కడ నుంచీ తీసుకుని తమ పేజీలలో ప్రచురిస్తున్నదీ సరైన courtesy ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నా పేజీల వివరాలు ఇవ్వని భాగాలకు నా బాధ్యతలేదు. అలాగే నేను ప్రచురించినవి తమ ఇష్టానుసారం ఎడిట్ చేసి ప్రచురించే వారుకూడా తమ సొంత బాధ్యతలపై ప్రచురించాల్సి ఉంటుంది.
4) ప్రచారకులుగా ఉండదలచినవారు నా మాదిరిగానే తమ ఫోటోలతో సహా, ఈ సంపూర్తి వివరాలు ప్రకటించవలసిందిగా కోరడమైనది. కొందరు ఫేస్ బుక్ నియమనిబంధనలు కూడా ఉల్లంఘిస్తున్నారని తెలుస్తోంది. ఇవి వారికి మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయి. కనుక బహిరంగంగా మీ మీ ప్రొఫైల్స్ ప్రకటించి ఈ భాషా ఉద్యమానికి ఒక స్వచ్ఛత తీసుకురావాలని కోరుతున్నాను.
5) నేను నిర్వాహకునిగా లేని ఇ-ప్రచురణలతో నాకు ఎటువంటి సంబంధం లేదు.
6) పాత్రికేయ రంగంలో నాకున్న 20 ఏళ్ల అనుభవం, విశేష అనుభవాలతో, నా దగ్గరున్న కచ్చితమైన ఆధారాలతో నేను వీటిని ప్రచురిస్తున్నాను. ఒకవేళ వీటిలో లోటుపాట్లు ఉంటే సవరించుకోవడానికి ఎటువంటి వెనకడుగూ వేయనని మనవి చేస్తున్నాను. వీటిని వెంటనే నా దృష్టికి తీసుకురావడానికి పై ఫోన్ నెంబర్ లేదా ఇ మెయిల్ ఉపయోగించమని ప్రార్థన.
7)ప్రజాస్వామ్యంలోని ఒక సంపూర్తి స్వేచ్ఛ ఉన్న పాత్రికేయునిగా చేస్తున్న సమాచార వితరణ ఓ మహోన్నతమైన భాషా ఉద్యమంగా రూపుదిద్దుకుందని కొందరు ఆశీర్వదించిన మీదట దీన్ని కొనసాగిస్తున్నాము. ఔత్సాహికులు స్వచ్ఛందంగా ఇందులో పాల్గోనాలని, తమ వివరాలు సంపూర్తిగా ప్రకటించాలని కోరుతున్నాను.
8)ప్రతీ అక్షరం వెనుకా, ప్రతీసమాచారం వెనుకా సంపూర్తి నిబద్ధత ఉన్న పరిశ్రమ చేసి వ్యాసాలు ప్రచురిస్తున్నాను. బెదిరింపులకు బెదరమని చెబుతూ మీ మద్దతు కావాలని అందరినీ కోరుతున్నాను.
ఇట్లు
ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం