banner1

గోదావరి నిత్య హారతి సేవా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించకపోతే, ఇది నిప్పుతో ఆడే జిమ్నాస్టిక్స్ విన్యాసంగా మారపోయే ప్రమాదం ఉంది. ఇది ఏ విధంగా విమర్శల పాలు అవుతోందో మీరే గమనించండి.

గంగా నదికి ఇస్తున్న హారతిని చూసి మొదలుపెట్టాము అని నిర్వాహకులు చెప్పారు కనుక గోదావరి నిత్యహారతికి కాపీ దోషాలు అంతగా వర్తించవు. కానీ సరైన పద్ధతిలో హారతి సేవా కార్యక్రమాన్ని నిర్వహించకపోతే ఇది నిప్పుతో ఆడే జిమ్నాస్టిక్స్ విన్యాసంగా మారపోయే ప్రమాదం ఉంది. ఇది ఏ విధంగా విమర్శల పాలు అవుతోందో మీరే గమనించండి.

కాశీలోని ఘాట్ల నిర్మాణం:

వారణాసి అని మనం అంటున్న పుణ్య భూమి అసలు పేరు వారాణసీ.

05112012859 వారణాసి కాదు

అసీ, వరుణ నదుల మధ్య ప్రాంతమే వారాణసి.

zoom

గంగలో రెండు నదుల సంగమ ప్రదేశం (చిత్రాన్ని క్లిక్ చేసి పెద్దదిగా చూడండి)

ఈ రెండు నదులూ కాశీలో గంగానదితో సంగమిస్తాయి.

varanవరుణా, గంగా సంగమం (చిత్రాన్ని క్లిక్ చేసి పెద్దదిగా చూడండి)

ఇది వరుణా నది గంగానదిని సంగమిస్తున్న ప్రాంతం.

assi

అసీ, గంగా సంగమం (చిత్రాన్ని క్లిక్ చేసి పెద్దదిగా చూడండి)

ఇది అసీ నది గంగానదిని సంగమిస్తున్న ప్రాంతం.

ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతమే వారాణసీ నగరం. కాశీలోని గంగానది ఘాట్ల నిర్మాణాలు ఒక క్రమపద్ధతిని సంతరించుకున్నాయి. ఒకప్పుడు ఇవన్నీ విడివిడిగా ఉన్నా నేడు ఒక ఘాట్ నుంచీ మరొక ఘాట్లో ప్రవేశించడానికి సులభంగా ఉంది. అంతేకాదు విశ్వనాథ మందిరం నుంచీ చాలా దూరంగా ఉండే ఘాట్ హరిశ్చంద్రాఘాట్. అయినా, ఈ ఘాట్ నుంచీ మణికర్ణిక వరకూ అన్నిఘాట్లను సందర్శిస్తూ నడుచుకుంటే వెళ్లవచ్చు. గోదావరిలోని ఘాట్ లలో ఇటువంటి నిర్మాణం లేదు. ఇప్పుడు తక్షణం చేయవలసిన పని ఇదే. గోదావరి ఘాట్లను కలుపుతూ నిర్మాణం జరిగితే బాగుంటుంది. లేదంటే ఇవి చిన్న చిన్న ఘాట్లుగా ఉండి హారతి వంటిపెద్ద సేవా కార్యక్రమాలకు వేదికలుగా నిలువ లేవనేది ప్రధాన విమర్శ.

వాగ్గేయకారులకు అవమానం:

భాష విషయంలో తమిళాన్ని ఏమైనా అంటే అరవం వాళ్లుకు పొడుచుకు చచ్చిపోతారు. కానీ, పాట పాడితే తెలుగులోనే పాడాలని తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి అన్నారు. దీనికి కారణం లేకపోలేదు.  త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు మొదలుకొని నేటి బాలమురళీకృష్ణ వరకూ ఎంతో మంది స్వరనీరాజనాలు పట్టినవారున్నారు మనకు. నారద తుంబురుల నుంచీ మా అమ్మ, బామ్మల వరకూ అందరూ మంగళ హారతులు పాడగలిగిన వారే. ఇటువంటి పరమోత్కృష్టమైన వారసత్వంలో పుట్టిన మనం హారతి పాటను కూడా కాపీకొట్టాలా? ఆపాటి బాణీలు కట్టేవారు తెలుగునాట లేరా? అనేది మరో ప్రధాన విమర్శ.
గోదావరి హారతి కార్యక్రమంలో ‘‘ఓం గోదావరి తల్లీ/ నీ చరణములకు ప్రణమిల్లీ/‘‘  అంటూ ‘‘సాగే‘‘ పాట బాణీ ఎన్ని రకాల నలిగిపోయిందోగానీ, వినీ వినీ ఆ రాగం అంటేనే కంపరమెత్తి పోతోంది అంటూ సంగీతం తెలిసిన సంప్రదాయవాదలు విమర్శిస్తున్నారు. తెలుగు బాణీతో ప్రారంభిస్తే బాగుండేదని వారు మనసులోని మాట బయటపెడుతున్నారు.

లైవ్ గా ఉండాలి:

Singer_at_Ganga_Aartiలైవ్ హారతులు పాడే గంగాతీర సంగీత విద్వాంసులు

హారతిలో ప్రీ రికార్డెడ్ భజనలూ, కీర్తనలూ, మంత్రోచ్ఛారణలూ ఉండడాన్ని కొందరు సంప్రదాయ వాదులు విమర్శిస్తున్నారు. హారతి కార్యక్రమంలో కాశీలో మాదిరిగా లైవ్ హారతులు పాడే సంగీత విద్వాంసులు ఉండాలని కోరుతున్నారు. ప్రీ రికార్డులు ఉండడం వల్ల హారతి కార్యక్రమం పవిత్రతను కోల్పోయి, ఒక జిమ్నాస్టిక్ విన్యాసం స్థాయికి దిగజారుతుందని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

వ్యాఖ్యానం కేవలం తెలుగులోనే ఉంది:

ఇక వ్యాఖ్యానం కూడా కేవలం తెలుగులోనే ఉంది. దీని వల్ల కేవలం తెలుగు వారినే హారతి కార్యక్రమం ఆకర్షిస్తుంది. గోదావరి తల్లి హిందువుల ఆరాధ్యదైవం. కేవలం తెలుగువారిదే కాదు. ఇతర భాషల వారు కేవలం తెలుగు వ్యాఖ్యానం వల్ల హారతి కార్యక్రమంలో పూర్తిగా లీనం కాలేకపోతున్నారు. వీరి కోసం హిందీలో వ్యాఖ్యానం ఉంచాలని కోరేవారున్నారు. అలాగే ఆంగ్లంలో కూడా వ్యాఖ్యానం ఉంచితే విదేశీయులు సైతం మన సంస్కృతి గురించి తెలుసుకుంటారనే వారు లేకపోలేదు. దీని వల్ల హారతి కార్యక్రమం సార్వజనీకం అవుతుందనే వారు లేకపోలేదు.

చాలా తక్కువ సమయం:

కాశీలోని గంగా హారతి  గంటన్నర వరకూ జరిగే కార్యక్రమం. కానీ గోదావరి హారతి అప్పుడే అయిపోయిందా అనేట్టుగా, అసంపూర్తిగా అరగంటలోనే ముగుస్తోంది. అయిపోయిందని కూడా తెలియడం లేదు. కేవలం శతమానం భవతి శతాయుః అనే శాంతి మంత్రాలు తెలిసిన వారు లేవడంతో మిగిలిన భక్తులు కూడా హారతి కార్యక్రమం అయిపోయిందని గ్రహించాల్సి వస్తుంది. ఇదే కార్యక్రమాన్ని గంటన్నర సేపు పెంచడాని కి కృషి చేస్తే బాగుంటుందని, దానికి హిందీ, ఆంగ్ల వ్యాఖ్యానాలు జోడించడం సరైన పద్ధతని కొందరు అంటున్నారు. నమకం, చమకం, రుద్రం, శ్రీసూక్తం, పురుషసూక్తంతో పాటు పలు మంత్రాలను జోడించి రూపకల్పన చేసిన కార్యక్రమం భక్తి భావాన్ని పెంచుతోంది. కానీ, ఇవి ప్రీ రికార్డెడ్ గా ఉండడం వల్ల పవిత్రత లోపించిందనేవారు అధికంగా ఉన్నారు.

 వాద్యఘోషలేదు:

హారతిలో అతి ముఖ్యమైంది వాద్య ఘోష. తాళాలు, ఢమరుకాలు, శంఖనాదాలు, చర్మవాయిద్యాలు, ఘంటానాదాలు అతి ముఖ్యమైనవి. కాశీలోని దశాశ్వమేధాఘాట్ లో హారతి కార్యక్రమంలో ఈ వాద్య ఘోషను వివిధ భక్తులు చేస్తారు. అంతేకానీ, దాన్ని కూడా ప్రీరికార్డు చేసి వినిపించడంలేదు. వివిధ వాద్యాలు దిక్కులు పిక్కటిల్లేగా సందడి చేయడం వెనుక ఎన్నో సాధనా రహస్యాలున్నాయి. వాటిని సాధకులు మాత్రమే గ్రహిస్తారు. మిగిలినవారు సుందరమైన వాద్య ఘోషలో లీనమైతారు.

ఈ అనుసంధానం ద్వారా వీడియోలో వాద్యఘోష మీరే వినండి

DSC_

కాశీలోని గంగా హారతి సమయంలో చర్మవాయిద్య ఘోష

అయితే, ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. వాద్యాలను యాంత్రీకరణ చేయడం కొంత వరకూ కొన్ని మఠాల్లో అంగీకరించారు. అంటే చర్మవాయిద్యాలైన వాటిని యంత్రాలు మ్రోగిస్తాయి. ఆగమ శాస్ర్తాల ప్రకారం నిర్మించిన ఇటువంటి మఠాల ఆచారాలను అందుకోవటంలో తప్పులేదు. కనీసం ఇంటిలో వాయించే గంటలైనా లైవ్ లో వాయించకపోవడం తీవ్ర విమర్శకు తావిస్తోంది.

9832988

 శంఖనాదాన్ని చేస్తూ గంగానదికి హారతిస్తున్న అర్చకులు

Ganga20Aartiగంగా హారతి సమయంలో భక్తులు మ్రోగించే గంటలు

IMG_8252

అగరు ధూపంతో అర్చకులు మ్రోగించే గంటలు

IMG_7431

హారతి కార్యక్రమంలో ఇతర సేవలు

పైన చూపించినవి కేవలం గంగా హారతి సమయంలో అర్చకులు చేసే సేవలకు ఉదాహరణలు మాత్రమే. ఈ వాయిద్యాల సేవలు కూడా ప్రీరికార్డెడు కావని గమనించగలరు.

ఆడియో వైఫల్యాలు:

సాంకేతిక వ్యవస్థలు ఇంకా శైశవ దశలో ఉన్నాయి. ఇది నిర్వాహకులు గమనించాలి. సంపూర్తిగా హారతి కార్యక్రమాన్ని డిజిటల్ యంత్రాల ద్వారా చేయాలనుకోవడం మంచిది కాదేమో. ఇది నిజమని అప్పుడప్పుడు ఆడియో వైఫల్యాలు రుజువు చేశాయి. డిజిటల్ వ్యవస్థలు వైఫల్యం చెందినప్పుడు లైవ్ గా మంత్రాలు చదివే వారు లేకపోవడం లోపమే అవుతుంది. ఇది పుష్కరాలు అయిపోయిన తరువాత శాశ్వత వేదిక మీద జరిగిన మొదటి కార్యక్రమంలో రుజువైంది. గోదావరి హారతి కార్యక్రమం మొదలుపెట్టి రెండు వారాలు కూడా గడవక ముందే పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ముందు ముందు ఆడియో వైఫల్యాలు మరింత భయంకరంగా ఉంటాయని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు.  అంతేకాక, హారతిలో మంత్రపఠనం, హారతుల ఆలాపన భక్తులలో మరింతగా భక్తిభావన పెంచుతాయి. వీటిని కూడా ప్రీరికార్డింగ్ చేయడం అర్ధరహితంగా ఉందని కొందరి వాదన. లైవ్ హారతుల వల్ల సంగీతకారులకు కూడా గోదావరి సేవాభాగ్యం కలుగుతుందని మరికొందరి సూచన.

హారతులు దర్శించుకోవాలా, కళ్లకద్దుకోవాలా?:

వ్యాఖ్యానంలో హారతులు దర్శించుకోండని చెప్పడం కొందరిని ఆశ్చర్యపరుస్తోంది. హారతులను ఎవరైనా కళ్లకద్దుకుంటారు. అంతేకానీ, దర్శించుకోరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు హారతులు కళ్లకద్దుకోకూడదా అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదేం సంప్రదాయం అని మరికొందరు విమర్శిస్తున్నారు.

వివిధ హారతులు:

హారతి కార్యక్రమంలో వివిధ హారతులు ఇవ్వడం బాగుంది. ఆ హారతులకు సంబంధించిన విశేషాలను వ్యాఖ్యానంలో చెప్పడం కూడా బాగుంది. సప్తగోదావరులకు హారతులు ఇస్తున్నాము అన్నట్టు ఏడుగురు అర్చకులు హారతులివ్వడం బాగుంది. నేత్ర హారతి, బిల్వహారతి, నాగహారతి, నందీశ్వర హారతి, వృక్ష హారతి, సింహహారతి, రుద్రహారతి, కుంభహారతి, కర్పూర హారతి, చక్రహారతి, శంఖహారతి, నక్షత్ర హారతి వంటివి ఇస్తున్నారు. వీటిలో అధిక భాగం ఆరుగురు ఇవ్వరు. కేవలం మధ్యలో ఉన్న అర్చకుడే ఇస్తారు.

ఇది కాశీలో లేదు. కాశీలో అందరూ సమానంగా ఇస్తారు. కేవలం ఒకరే సింహభాగ హారతులు ఇచ్చే పక్షంలో మిగిలిన ఆరుగురు అర్చకులు భక్తుల ఏకాగ్రతకు ప్రతిబంధకంగా ఉన్నారు. అలాగే సింహభాగంలోని వ్యక్తికి ప్రత్యేకంగా ఎత్తైన వేదిక ఉండి, ఆయన ప్రత్యేక హారతులు ఇచ్చేటప్పుడు మిగిలిన వారు నిలిచి ఉంటే బాగుండేది. ఎందుకంటే అన్నిహారతులూ అందరూ ఇవ్వడంలేదు. కేవలం రెండు మూడు హారతులే ఏడుగురూ ఇస్తారు. మధ్యలోని వ్యక్తే అధిక భాగ హారతులు ఇస్తారు. మిగలిన వారు కార్యక్రమం మొత్తం కేవలం ఒకే హారతిని తిప్పుతూ ఉన్నారు. ఏడుగురిలో మధ్యనున్న వ్యక్తి విశేషంగా ఉండి, తాను ఇస్తున్న ప్రత్యేక హారతులతో భక్తులను ఆకర్షించలేక పోవడం ముఖ్యమైన లోపమే అని తెలిసన వారు విమర్శిస్తున్నారు.  అయితే, మిగిలిన ఆరుగురూ ఈ విధంగా నిలిచి ఉంటే వారు ఎందుకు ఉన్నట్లూ అనే ధోషం వస్తుంది. కనుక ఈ సమస్యను నిర్వాహకులు పరిష్కరించవలసి ఉంది.

Photo01161

మధ్యలోని అర్చకుడు నందీశ్వర హారతి ఇస్తుండగా, మిగిలిన ఆరుగురూ మామూలు హారతులు ఇస్తున్న దృశ్యం

నిర్వహణా లోపాలు :

అయితే నిర్వహణా లోపాలు బాల్యదశలోని కార్యక్రమంలో కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఏడుగురిలో ఒకరికి నిర్వాహకులు ఆసనం అమర్చకపోవడం కనిపించింది. అయితే కార్యక్రమం మొదలు అయిపోవడంతో గుంభనంగా కింద కూర్చుని హారతి నిర్వహించడం కనిపించింది.

Photo01191

మొదటి అర్చకునికి ఆసనం లేకపోవడం గమనించవచ్చు (చిత్రాన్ని క్లిక్ చేసి పెద్దదిగా చూడండి)

హారతి కార్యమానికి పుష్కరఘాట్ సరైన వేదికేనా?:

కాశీలోని దశాశ్వమేధా ఘాట్ లో గంగా హారతి కార్యక్రమం ప్రతీరోజూ కన్నుల పండుగలా జరుగుతుంది. అక్కడ భక్తులు కూర్చునే ఏర్పాటు కూడా సరిగ్గా అతికి నట్లు సరిపోయింది. రోమ్ నగరంలో అలనాటి స్టేడియంలా ఉంటుంది. వేలాది మంది భక్తులు ఎక్కడ కూర్చున్నా హారతి కార్యక్రమాన్ని చూడగలుగుతారు.

gallery4

 

భక్తులు ఎక్కడ కూర్చున్నా హారతి కార్యక్రమాన్ని చూడగలరు

డబ్బులున్న మారాజులు పడవలు అద్దెకు తీసుకుని గంగానదిలో నుండీ చూస్తూ హారతి కార్యక్రమాన్ని తమ కెమేరాలలో బంధిస్తారు.

gallery3

అయితే, పుష్కర ఘాట్ కు ఇన్ని సొబగులు లేవు. పైగా, ఇది చాలా చిన్న ఘాట్. రాబోయే రోజుల్లో కార్తీక మాసం, శివరాత్రి, ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదేజరిగితే, అక్కడ భక్తుల తాకిడి తట్టుకునే శక్తి ఈ ఘాట్ కు లేదు. హారతి కార్యక్రమం ఘాట్ కు ముందు ముందు ప్రతిబంధకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భద్రతా విషయాలు విశ్లేషించగలిగిన వారు అంటున్నారు. సామాన్య భక్తుల మాట వదిలేసి, విఐపీలకు సీట్లు సమకూర్చడమే కష్టంగా మారే అవకాశం ఉంది. పుష్కరాల సమయంలో హారతి సమయంలో పుష్కరఘాట్ విఐపీలతో నిండిపోవడంతో, కిలోమీటర్ల కొద్దీ దూరం భక్తులు బయట నిలిచిపోయి, నిరాశగా, హారతి చూడలేక వెళ్లిపోవడం గమనించడం జరిగింది.

ఆలయాలదర్శనకు అవరోధమా?:

పుష్కర ఘాట్లో చిన్న చిన్న ఆలయాలు చాలానే ఉన్నాయి. ఇవి ఎంత చిన్న ఆలయాలు అంటే ముగ్గురు, నలుగురు భక్తులు ఆలయంలో ప్రవేశిస్తే ఆలయం నిండిపోయేంత చిన్నవి కూడా ఉన్నాయి. దీనికి ఉదాహరణ పడమర వైపు ఉన్న శివాలయం. ఇంత చిన్న ఆలయం ఇక్కడ ఉండడం వల్ల రాబోయే పర్వదినాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడి, భద్రతా సమస్యలు ఏర్పడతాయి. ఈ ఆలయాలకు భారీ స్థాయిలో భక్తుల రద్దీని తట్టుకోగలిగిన సమర్థతలు లేవు. తొక్కిసలాటలు జరగవన్న హామీ లేదు.

తక్షణ అవసరం ఏమిటి?:

హారతి కార్యక్రమం రేపు క్రౌడ్ పుల్లింగ్ చేస్తే ఈ ఆలయాల నిర్వహణ సమస్య పోలీసులకు సవాల్ విసురుతాయి. కనుక భక్తుల భద్రతా దృష్ట్యా హారతి కార్యక్రమం పుష్కర ఘాట్ కు అనుకూలం కాదని భద్రతా నిపుణులు అంటున్నారు. దీనికి తోడుగా ఆడవారు బట్టలు మార్చుకునే గదులు ఘాట్లలో దాదాపు లేవు. చాలా చోట్ల టెంపరరీగా నిర్మించారు. ఫుష్కర ఘాట్లో మూడు చోట్ల ఆడవారికి గదులు కేటాయించారు. కానీ ఇవి సరిపోలేదు. ఈ అంశంలో పుష్కర ఏర్పాటు దార్లు దారుణంగా విఫలం అయ్యారు. నూటికి 80 శాతం మంది మహిళలు తడి వస్త్రాలు పిండుకునే అవకాశం కూడా లేక, నీళ్లోడుతూ ఘాట్ ల నుంచీ వెళ్లడం జరిగింది. అంటే పుష్కర ఘాట్ కు కావలసింది అత్యవసరంగా ఆడవారు బట్టలు మార్చుకునే స్థలాల వృద్ధి. పుష్కర ఘాట్ అంటే భక్తులలో ఒక విధమైన ప్రత్యేక విశ్వాసం ఏర్పడిన తరుణంలో ఇప్పటికే ప్రత్యేకత ఉన్న ఘాట్ కు అదనపు ఆకర్షణ చేకూర్చాల్సిన అవసరం లేదు. పైగా హారతుల పేరిట రేపు విఐపీల తాకిడి మొదలైతే సమస్య మళ్లీ ‘‘మొదటికి‘‘ వస్తుందేమో అని శంకించే వారూ లేకపోలేదు.

దేవునికి పృష్ఠభాగం చూపించవచ్చా?:

హారతులు ఇచ్చే వేదికలు నిర్మించిన చోటు కూడా విమర్శల పాలయ్యింది. ప్రస్తుతం నిత్య హారతుల కోసం నిర్మించిన శాశ్వత వేదిక వెనుక శివాలయాలు ఉన్నాయి. ఈ శివాలయాలకు పృష్ఠ భాగం చూపిస్తూ గోదావరికి హారతులు ఇస్తున్నారు. దేవదేవుడు ముందు ఈ విధంగా నిలిచి హారతులు ఇవ్వడాన్ని సంప్రదాయవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. పుష్కర ఘాట్ మాదిరి ఆలయాలు అశ్వమేధాది ఘాట్లలో లేవు. ఇది నిర్వాహకులు గమనించాలి. దేవదేవుడు తన కుమారులు, దేవేరితోపాటు వివిధ ఆలయాలలో కొలువు తీరి ఉండగా, సకల అర్చనలూ ఆయనకు మాత్రమే జరగాలి. సర్వేశ్వరునికి పృష్ఠభాగం చూపిస్తూ హారతులు ఇస్తే, భక్తులకు దృష్టి దోషం, ఏకాగ్రతా దోషం కలుగుతుంది.

గంగానది సాక్షాత్తూ విష్ణుపాదోద్భవురాలు. దివిజ గంగ భువి మీద తన పాదాన్ని ఉంచడానికి బదులు దేవదేవుని జటాజూటంలో మజిలీ చేసి, మృదువుగా పృథ్విని తాకింది. కాశీలోని గంగానది సాక్షాత్తూ గంగానది అయితే, గోదావరి గౌతముని వలన ఆవిర్భవించిన గంగానది మరో అవతారం. ఈ రెండూ శివస్వరూపాలే. రెండింటిలోనూ దేవదేవునే చూడాలి. అటువంటిది, దేవదేవుడే సాక్షాత్తూ కొలువై ఉంటే, ఆయనకు పృష్ఠభాగం చూపిస్తూ గంగానది మరో అవతారానికి హారతి ఇవ్వడం దోషం అని కొందరు భావిస్తున్నారు.

అంటే బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న శివాలయాలను కాక, గోదావరి హారతులు చూడడం శివాపరాధం చేసినట్లేననే వాదన కొంత మంది చేస్తున్నారు.

ఘాట్ లలో దేవాలయాల నిర్మాణం:

ఇక, కాశీ ఘాట్ లలో దేవాలయాల నిర్మాణం కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి.

Dashashwamedha_ghatఇక్కడ ఉన్న దేవాలయాలు అన్నీ మణికర్ణిక వైపే చూస్తూ ఉంటాయి. గంగా నదిని కాదు.

ఇది అందరూ ముఖ్యంగా గమనించదగిన అంశం. గోదావరి తీరంలో, ముఖ్యంగా పుష్కర ఘాట్ లో హారతి నిర్వహిస్తున్న చోట ఉన్న దేవాలయాలు గోదావరి వైపు తెరుచుకుని ఉన్నాయి.

నిర్వాహకుల అవగాహనా లోపం:

హారతులు ఇస్తున్న సమయంలో గోదావరికీ హారతులకూ మధ్య మీడియా వారిని కూడా రానీయకుండా అత్యుత్సాహాన్ని నిర్వాహకులు ప్రదర్శిస్తున్నారు. కాశీలో ఇటువంటి దేమీ లేదు. హారతుల ముందు, వెనుక, ప్రక్కల కూడా భక్తులు కూర్చుంటారు. గంగా నదిలో కూడా పడవల మీద కూర్చుని చూస్తారు. ఈ సమయంలో పడవలు నడిపేవారు ప్రత్యేకంగా పడవలు నడిపి జీవిక పొందుతారు. హారతి కార్యక్రమం వారికి ప్రత్యేక వనరుగా ఉపయోగిస్తోంది. గోదావరిలో టూరిజం శాఖ వారి దగ్గర ఉన్న బోట్లు నిరుపయోగంగా పడి ఉంటున్నాయి. వారు హారతి సమయంలో బోట్లలో జనాలను ఎక్కించుకుని వీక్షించే అవకాశం కనిపిస్తే నెలరోజుల్లో వారికున్న అప్పుఅన్నీ తీరిపోతాయి. అంత విశేషంగా టూరిజం బోట్లనూ లేదా స్థానికంగా పడవలు నడిపే వారికి గోదారమ్మ బువ్వపెడుతుంది.

చెప్పులు విడవాలా?

హారతి సమయంలో చెప్పులు ధరించరాదు. కూర్చున్నవారు కూడా తమ చెప్పులు విడిచి, అవి పోకుండా వాటిమీద కాళ్లు పెట్టి భక్తి భగవంతుడి మీద చిత్తం చెప్పుల మీద నిలుపుతున్నారు. కానీ, పోలీసులు మాత్రం బూట్లు ధరించి డ్యూటీ చేస్తున్నారు. సామాన్య భక్తులు మెట్ల మీద కూర్చుంటే వీరు కుర్చీల మీద కూర్చుని అధికార దర్పం వెలగబెడుతున్నారు. భగవంతుడి ముందు అందరూ సమానమే అయినా విఐపీలు కొంచెం ఎక్కువ సమానం కాబోలు?

పాడుపడిన కోటలో సౌండ్ అండ్ లైట్స్ ప్రోగాం కాదు:

హారతి ప్రోగ్రాం అంటే గబ్బిళాల కంపుకొట్టే కోట మీద లైట్లు వేసి సౌండ్స్ వినిపించే ప్రదర్శన కాదు.

christie-)పవిత్రత, భక్తి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు పాటించకపోతే హారతి సేవ జిమ్నాస్టిక్స్ ప్రోగ్రాంగా మారిపోయే అవకాశం ఉంది. ప్రీరికార్డింగ్ తో, అగ్నితో చేసే విన్యాసం కాదు హారతి అంటే. ఈ స్థాయికి దీన్ని తీసుకు రాకుండా ఉండడమే మంచిదని సంప్రదాయవాదులు అంటున్నారు.

 సంకల్పం మంచిదే

మొదలుపెట్టిన దశాబ్దాల తరువాత  గంగా హారతి  అంతర్జాతీయ ఉగ్రవాదుల కళ్లు కూడా పడేంతగా ప్రాముఖ్యం పొందింది. గోదావరికి ఇటువంటి నిత్యహారతి సేవ చేయాలని  సంకల్పించడం మంచిదే. పైన చెప్పిన లోపాలు, విమర్శలూ సవరించుకోవడం వల్ల ప్రజల్లో భక్తి భావం మరింత పెరుగుతుంది. లేదంటే ఇది కూడా కార్పొరేట్ విన్యాసం అవుతుంది. అప్పుడు దీన్ని దేవాదాయ శాఖ నుంచీ టూరిజం శాఖకు అప్పగిస్తే సరిపోతుంది.

-ఏలూరిపాటి

అంతర్జాలంలో అధిక ప్రశంసలు అందుకున్న వీటిని మీరు చదివారా?

పుష్కరాలు- కొన్ని పాఠాలు : ఏలూరిపాటి

పుష్కర గోదావరిలో మట్టి, రాళ్లు వేయకండి !!!- ఏలూరిపాటి

పెదముత్తీవిలో అభిషేకాలు – ఏలూరిపాటి

శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానం మీరు విన్నారా?

ఇప్పటికే విడుదలైన శ్రీసీతారామకల్యాణవ్యాఖ్యానభాగాలు

01-   ప్రారంభం

02-   పుట్టిన్రోజే కల్యాణమా?

03- నవవిధరామరూపాలు

04- పెళ్లినడకలతో కదలిన రాముడు 

05- కల్యాణ మండప ప్రవేశం

06- తిరువారాధనం

07- విష్వక్సేన పూజ 

08- కర్మణ: పుణ్యా: వాచనం 

 09- ఒకరికెదురుగా మరొకరు

10- ప్రవరలు

11- యోక్త్ర – కంకణ ధారణ 

12- యజ్ఞోపవీతధారణం – కాళ్లు కడగడం 

13- ఆభరణధారణ 

14- వరపూజ , మధుపర్కాలు

15- మహాసంకల్పం 

16- కన్యాదానం

17- మంగళాష్టకాలు 

 18- వేదపఠనం

19- సుముహూర్తం

20- సూత్రధారణ

21- తలబ్రాలు, స్వస్తి

ఇప్పటికే విడుదలైన “ఆంధ్రవ్యాస”భారతం భాగాలు

“ఆంధ్రవ్యాస”భారతం – 121 –భారతంలోని సత్యాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 122 –భారతంలోని నిజాలు ఇవే – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 123 –పాచికలకుట్రలోని నిజాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 124 –భారతంలోని మాయాజూదం ఇదే – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 125 –భారతంలో దూషణపర్వం- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 126 –సర్వం ఓడిన ధర్మజుడు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 127 –ద్రౌపదినోడిన ధర్మజుడు- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 128 –నన్నోడితన్నోడెనా….?- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 129 –ఏది నిజం?- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 130 –దుశ్శాసనుడి రౌడీయిజం- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 131 –ద్రౌపది దీనావస్థ- ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 132 –ద్రౌపది భీష్మ సంవాదం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 133 –కౌరవులందరూ దుర్మార్గులేనా? – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 134 –కర్ణుడి నీచత్వం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 135 –శ్రీకృష్ణుని ప్రార్థించిన ద్రౌపది – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 136 –ద్రౌపదీ వస్త్రాపహరణం – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 137 –విదురుని హెచ్చరికలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 138 –ద్రౌపదికున్న ఓరిమి – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 139 –దుర్యోధనుని కుయుక్తులు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 140 –వాగ్బాణాలు – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 141 –తొడలు విరగ్గొడతా..! – ఏలూరిపాటి

“ఆంధ్రవ్యాస”భారతం – 142 –ద్రౌపదికి ధృతరాష్ట్రుడి వరాలు – ఏలూరిపాటి

ప్రకటనలు