na11నేడు ఆంధ్ర వ్యాస శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్యగారి వర్ధంతి. తెలుగు పంచాంగం ప్రకారం ఆయన ఆషాఢ మాసం పౌర్ణమి నాడు పరమపదించారు. చాలా అరుదుగా జయంతి, వర్ధంతి వెంట వెంటనే వచ్చాయి. నేడు అధిక ఆషాఢమాసంలో పౌర్ణమి. ఆంగ్ల కేలండర్ ప్రకారం జూన్ 30 ఆయన జయంతి, అధిక ఆషాఢ మాసంలో నేడు ఆయన వర్ధంతి కావడం విశేషం. ఈ సందర్భంగా అష్టాదశమహాపురాణాలను యథాతథంగా ఆంధ్రీకరించడానికి జీవితాన్ని అంకితం చేసిన ఆయన కృషిని మీకు అందిస్తున్నాము. అంతర్జాలంలోని www.anantasahiti.org అనే వెబ్ సైట్ ద్వారా అందించడం జరుగుతోంది. https://www.facebook.com/groups/anantasahiti/ ఫేస్ బుక్ లోని అనంతసాహితీ బృందంలో సభ్యులుగా చేరి ధర్మ ప్రచారాభిలాషులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము.
కార్యదర్శి
అనంతసాహితి

ప్రకటనలు