acupuncture

రేడియేషన్ చికిత్సలో కూడా పేషంట్ అంగీకార పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. రేడియేషన్ చికిత్స ప్రారంభం కాకమునుపే పేషంటుకు వైద్యుడు రేడియేషన్ చికిత్సలోని లాభనష్టాలను విడమర్చి చెప్పాలి. పేషంటుకు వచ్చిన వ్యాథి, అది స్థాయిలో ఉందీ, దీనికి ఉన్న చికిత్సలు, రాబోయే సైడ్ ఎఫెక్టులు, విజయం చేకూరే అవకాశాలు కూలంకషంగా చెప్పాలి. అంతేకాదు, అందుబాటులో ఉన్న ఇతర చికిత్సల గురించి కూడా చెప్పాలి. ఇది న్యాయంగా వైద్యులు అనుసరించాల్సిన పద్ధతి.కేన్సర్ బాధితుల సహాయ బృందం కార్యదర్శి తనకు తెలిసిన రేడియోథెరపీ వివరాలు చెబుతున్నారు.

***********               *******************                *******************

క్లిష్టమైన వైద్య విధానాల్లో పేషంట్ లేదా సంరక్షకుడు చికిత్సకు అంగీకరిస్తూ సంతకం చేయడం తప్పనిసరి.

రేడియేషన్ చికిత్సలో కూడా పేషంట్ అంగీకార పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. రేడియేషన్ చికిత్స ప్రారంభం కాకమునుపే పేషంటుకు వైద్యుడు రేడియేషన్ చికిత్సలోని లాభనష్టాలను విడమర్చి చెప్పాలి. పేషంటుకు వచ్చిన వ్యాథి, అది స్థాయిలో ఉందీ, దీనికి ఉన్న చికిత్సలు, రాబోయే సైడ్ ఎఫెక్టులు, విజయం చేకూరే అవకాశాలు కూలంకషంగా చెప్పాలి. అంతేకాదు, అందుబాటులో ఉన్న ఇతర చికిత్సల గురించి కూడా చెప్పాలి. ఇది న్యాయంగా వైద్యులు అనుసరించాల్సిన పద్ధతి. కానీ నేడు వైద్యులు దీన్ని అనుసరిస్తున్నారో దేవుడికే తెలియాలి. అనారోగ్యకరమైన వైద్యరంగ పోటీల వల్ల తలుపులు వేసి రోగి పారిపోయే వీలులేకుండా బంధించి వైద్యం చేయడం పరిపాటిగా మారుతోంది. కోట్ల ఖరీదు చేసే యంత్రాలు, లక్షల్లో నిపుణులకు జీతాలు చెల్లిస్తు నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడు అవుతుంటే ఆసుపత్రులు న్యాయ మార్గాలు అనుసరిస్తాయో కలియుగమే నిర్ణయించాలి. చికిత్సలోని లాభనష్టాలు సంపూర్తిగా తెలియ చెప్పాక పేషంటు అంగీకారాన్ని లిఖిత పూర్వకంగా తీసుకోవాల్సి ఉంటుంది. పేషంటుకు తనకు వచ్చిన సందేహాలు వైద్యుడిని అడిగే హక్కు ఉంది. వాటికి సంతృప్తికర సమాధానాలు వైద్యుని నుంచి పొందే హక్కు ఉంది. అన్ని సందేహాలకు తగిన సమాధానాలు ఇవ్వవలసిన బాధ్యత వైద్యుడిపై ఉంది. కనుక పేషంట్లు తమ సందేహాలు ఒక కాగితంపై రాసుకుని మరిచిపోకుండా వాటిని నివృత్తి చేసుకోవాలి. చికిత్సా విధానంపై అనుమానాలు వచ్చినా, తనకు నచ్చకపోయినా చికిత్సను తిరస్కరించే హక్కు పేషంట్లకు ఉంది. చికిత్స చేయించుకోమని ఒత్తిడి చేసే హక్కు ఆసుపత్రి వర్గాలకు లేదు.

దీనికి తోడు కొన్ని బాధ్యతలు కూడా పేషంట్లకు ఉన్నాయి. గర్భం వచ్చే అవకాశాలు ఉంటే రేడియాలజీ విభాగానికి తప్పకుండా చెప్పాలి. కడుపుతో ఉన్నా, కడుపు వచ్చే అవకాశం ఉన్నా ఎక్స్ రే, రేడియేషన్ వంటివి తీయించుకోరాదు. ఇవి కడుపులోని పిండానికి హాని చేస్తాయి. కనుక రేడియాలజీ విభాగంలోని సిబ్బందికి వివరాలు చెప్పడం మన బాధ్యత.

ఇవన్నీ నాకు తెలిసిన రేడియేషన్ సమాచారం. ఇది కాక అతి ముఖ్యమైనది రేడియోథెరపీకి అనుబంధ వైద్యాలు.

రేడియేషన్ జరుగుతున్నప్పుడు కొన్నిఅనుబంధ చికిత్సలు కూడా చేయించుకొవడం మంచి ఫలితాలను ఇస్తుంది. దీనివల్ల జీవనవిధానం మరింత మెరుగవుతుంది. మార్గాలు పేషంట్లలో మానసిక ధైర్యాన్ని కూడా పెంచుతాయి. ధ్యానం చేయడం వల్ల కేన్సర్ పేషంట్లలో ఆందోళన తగ్గుతుంది. బంధువులు మృదువుగా మర్దనం చేయడం కొద్దిమందికి ఉపకరిస్తుంది. చేతిమీద నిమరడం ద్వారా స్పర్శ కూడా పేషంట్లకు మంచిచేస్తుంది.

నిజానికి స్పర్శ చాలా బలమైన రోగనిరోధక సాధనం. పేషంట్లలో ధైర్యాన్ని కలిగిస్తుంది. వారిలో ఉన్న అనిశ్చితస్థితి, భయం, నొప్పి వంటి బాధలను తాకడం అనే చర్య దూరం చేస్తుంది. వీటికి తోడుగా, కొన్ని సంప్రదాయక చికిత్సలు కూడా పేషంట్లకు బాధలు దూరం చేస్తాయి. వీటిలో ఆరోమాథెరపీ, ఆర్ట్ థెరపీ, కలర్ అండ్ సౌండ్ చికిత్స, మర్దనం, రిఫ్లెక్సాలజీ, రిలాక్సేషన్, విజువలైజేషన్, గైడెడ్ ఇమేజెరీ పద్ధతులు, ఆక్యుపంచర్ పద్ధతులు ముఖ్యమైనవి.

ఉదాహరణకు రిలాక్సేషన్ చాలా మంచి చేస్తుంది. విశ్రాంతి తీసుకోవడం ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవాల్సిన అభ్యాసం. దీనివలన ఒత్తిడికి గురైన కండరాలు సడలింపుపొందుతాయి. ఒత్తిడిని పారదోలుతుంది. శ్రమ, అలసటలను తగ్గిస్తుంది. నిద్రలో గాఢతను పెంచుతుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మనోభావాలను అదుపులో పెట్టుకునే శక్తిని ఇస్తుంది. రిలాక్స్ కావడం అంటే కేవలం అన్నింటినీ తేలిగ్గా తీసుకోవడం కాదు. సమస్యలు, ఆందోళనలపై శక్తిని కేంద్రీకరించి ఆశావహంగా మానసిక ధనాత్మక శక్తిని మూటగట్టుకుని పరిష్కారాలు సాధించడం.” అని ఆయన చెప్పడం ఆపారు.

తరువాయి భాగం రేపు ఇదేచోట

గడచిన భాగాలు

కేన్సర్ “జాలం” –1- మూడులోకాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –2- నాన్న ప్రేమ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –3- పునర్జన్మ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –4- నాన్నలేనిలోటు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –5- తెరచాటు యుద్ధాలు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –6- దొంగదెబ్బలు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –7- తోడేళ్ల దాడి– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –8- పరాన్నజీవులు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –9- పంచాగ్నిమధ్యం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –10- ఉత్తర దక్షిణాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –11- పడగనీడలో పెళ్లిళ్లు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –12- చాటింగ్ చీటింగ్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –13- సైబర్ ఫ్రాడ్– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –14-సైబర్ జాలం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –15-ఇ.ప్రేమ జాలం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –16- సైబర్ ముఠాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –17- సైబర్ కాప్స్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –18- విశృంఖలత్వం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –19- మారుమనువు పుట్టలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –20- ఆన్ లైన్ పెళ్లిళ్లు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –21- పెళ్లికూపాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –22- ఇష్టానిష్టాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –23- లింఫోమా కేన్సర్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –24- జీవించేకళ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –25- నమ్మకం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –26- రథసారథి – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –27- రియల్ మాఫియా – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –28- భూ బకాసురులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –29- చివరిపోరు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –30- మెడలో పాము – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –31- కలుపుమొక్కలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –32- ఉక్కుమనిషి – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –33- కాగితపు పెళ్లాం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –34- ఉన్నతశిఖరాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –35- ధైర్యం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –36- లింఫోమా – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –37- నాన్ హెడ్జికిన్ లింఫోమా – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –38- సైడ్ ఎఫెక్టులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –39- ఏది మంచి? ఏది చెడు? – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –40- లాభనష్టాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –41- రక్తవ్యవస్థ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –42- రక్తపరీక్షలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –43-వైద్య నివేదికలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –44-రక్తదానం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –45-ఇమేజింగ్ టెస్టులు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –46- సిటి స్కానింగులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –47- పెట్ స్కానింగు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –48- మెడికల్ రికార్డులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –49- పరిశుభ్రత – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –50- అలసట జయించండి – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –51- మబ్బుతెరలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –52- మానసికగ్రహణం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –53- నిద్రమాంద్యం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –54- నొప్పి నివారణ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –55- రేడియో థెరపీ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –56- కనిపించని కిరణాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –57- రేడియో థెరపీ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –58- చికిత్స పథక రచన – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –59- రేడియో థెరపీ రకాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –60- రేడియో థెరపీ సైడ్ ఎఫెక్టులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –61- రేడియోథెరపీ జుట్టురాలుట – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –62- దీర్ఘకాలిక నష్టాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –63- చోటును బట్టీ సైడ్ ఎఫెక్టు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –64- నిర్లక్ష్యం వద్దు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –65- అంతర్గత రేడియో థెరపీ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –66- బ్రాచీథెరపీ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –67- బ్రాచీథెరపీ-2 – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –68- ఐసోటోపులతో చికిత్స – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –69- సహాయకులు – ఏలూరిపాటి

ఒక ముఖ్య ప్రకటన : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు,అంశాలకు, సమాచారాలకు, నివేదికలకూ నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది. ఇక్కడ ఇస్తున్న సమాచారాలు వైద్యనిపుణుల సలహాలు,సంప్రదింపులకు ప్రత్యామ్నాయాలు కాదు. చదువరులు తమకు లేక తమవారికి ఉన్న కేన్సర్ వ్యాధులను వైద్య నిపుణుల చేత పరీక్షింపచేయించుకుని నిర్ధారించుకుని తీరవలెను. వారికి వచ్చే సందేహాలకు వైద్యులు ఇచ్చే సలహాలు, చేసే సూచనలు నిర్ద్వందంగా పాటించవలెను. ఇక్కడ ప్రచురిస్తున్న అభిప్రాయాలు, ఆలోచనలు,అవలోకనాలు మొదలైనవి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పాత్రికేయ రంగ జాగ్రత్తలతో ఇస్తున్నాను. ఆయా రంగాల నిపుణుల సలహాల మేరకు, ప్రకటనల మేరకు,సమాచారాల మేరకు దీని రూపరచన జరిగింది. అయినా, ఇందులో ఉన్న లోటుపాట్లను, లోపాలను, తప్పొప్పులను ఇతరాలను నా దృష్టికి తీసుకువస్తే సహేతుకమైనవాటిని సవరించడానికి సిద్ధం. ఇక్కడ ఉన్న ఏ విధమైన సమాచారమైన మీ వైద్యులు చెప్పేదానికి విరుద్ధంగా ఉంటే వైద్యబృందం చెప్పేదే తుదకు అంగీకార యోగ్యమైనదిగా గ్రహించగలరు.

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ప్రకటనలు