3-065-1

ఏ పేషంట్ కు ఎంతవరకు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అనేది ఒక కళ. దీని ప్రధాన ఉద్దేశం రోగికి మానసిక ధైర్యం కలిగించడమే అని చుట్టు పక్కల వారు గమనించాలి. ఎవరు పడితే వారు పేషంట్లుకు సలహాలు ఇవ్వకూడదు.

************** **************** **************

కొద్దిమందికి మూత్రాశయ సమస్యలు వస్తాయి.” అంటూ రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్టుల గురించి కేన్సర్ బాధితుల సహాయ బృందం కార్యకర్త తన దగ్గరున్న సమాచారం చెబుతున్నారు.

మరికొంతమందికి మూత్రవిసర్జన చేసేటప్పుడు మంట కలుగుతుంది. ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావచ్చు. వీటి నుంచి బయట పడడానికి నీరు ఎక్కువగా తాగాలి. కాఫీ, టీ, సారాయి, ఆమ్లాలు ఉన్న పళ్లరసాలు (కమలాలు వంటివి) తాగరాదు. ఇవి మూత్రాశయాన్ని మరింతగా మండిస్తాయి. బార్లీ నీళ్లు వంటివి మంచివి.

ఇప్పటి వరకూ నేను బహిర్గత రేడియే థెరపీ గురించి చెప్పాను. ఇప్పుడు అంతర్గత రేడియోథెరపీ గురించి చెబుతాను. అంతర్గత రేడియేషన్ ను రెండు రకాలుగా ఇస్తారు. రేడియో ధార్మిక పదార్థాలను కేన్సర్ కంతుల దగ్గరకు లేదా లోపలకు ప్రవేశపెట్టడం ఒక విధానం. దీన్ని బ్రాకీథెరపీ అంటారు. రెండో విధానంలో రేడియో ధార్మిక పదార్థాలున్న ద్రవాలను త్రాగించడం లేదా నరాల ద్వారా రేడియేషన్ ఇస్తారు. దీన్ని రేడియో ఐసోటోప్ చికిత్స అంటారు. అంతర్గత రేడియేషన్ ను పేషంట్లకు ఆసుపత్రిలో చేర్చుకుని ఇస్తారు. ఇందుకోసం కనీసం కొన్ని రోజులు ఆసుపత్రిలో ఇన్ పేషంట్ గా ఉండాలి. శరీరంలోని రేడియో ధార్మిక పదార్థాలను ప్రవేశ పెట్టిన తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, అంతర్గత రేడియేషన్ పొందిన పేషంట్ నుంచి ఇతరులకు రేడియేషన్ సోకే ప్రమాదం ఉంది. కనుక కొద్ది రోజుల పాటు పేషంట్లను దూరంగా ఉంచి, జాగ్రత్తగా సంరక్షిస్తారు. ఇతరులకు రేడియేషన్ సోకే సమయం దాటిపోయిన తరువాత పేషంట్లు సాధారణ జీవితం గడపవచ్చు. కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలుసుకోవచ్చు.

అంతర్గత రేడియేషన్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. రోగ తీవ్రత, చికిత్సలో వాడుతున్న రేడియేషన్ లను బట్టి కొద్ది రోజులు ఏకాంతంగా ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆసుపత్రి సిబ్బంది కూడా అనేక రకాల జాగ్రత్తలతో ఉంటారు. ఈ జాగ్రత్తలను చికిత్స మొదలు పెట్టబోయే ముందుగానే పేషంట్లకు, వారి బంధువులకు వైద్యబృందాలు చెబుతాయి. వీటిని తూ, , తప్పకుండా పాటించి తీరాలి. ఏ మాత్రం అలక్ష్యం చేయరాదు. చికిత్స ప్రారంభం కావడానికి ఒక రోజు ముందుగా ఆసుపత్రిలో చేరాలి.

చికిత్స ప్రారంభం అయ్యాక, పేషంటును ఏకాంతంగా ఉంచుతారు. ప్రధానమైన వార్డు నుంచి దూరంగా ఉంచుతారు. రేడియేషన్ నిరోధించే లెడ్ తెరలు పేషంటు మంచం చుట్టు ఉంచుతారు. ఇవి పేషంటు నుంచి రేడియేషన్ ఇతరులకు సోకకుండా నిరోధిస్తాయి. వైద్యులు, వైద్య సిబ్బంది అతి కొద్ది సమయంపాటు మాత్రామే పేషంటు దగ్గర ఉంటారు. చిన్న పిల్లలను, గర్భిణులను ఈ పేషంట్లను చూడడానికి అనుమతి ఇవ్వరు. గీగర్ కౌంటర్ అనే రేడియేషన్ కొలిచే పరికరాన్ని పేషంటు దగ్గర ఉంచుతారు. దీని ద్వారా రేడియేషన్ ను కొలుస్తారు. నర్సులు ధరించదగిన గీగర్ కౌంటర్ ను తమతో సదా ఉంచుకుంటారు. సందర్శకులను నియంత్రిస్తారు. తప్పని సరి పరిస్థితులలో ఇంటర్ కం ద్వారా పేషంట్ తో మాట్లాడిస్తారు. ఇటువంటి ఏర్పాట్లు పేషంట్లలో మానసిక ధైర్యాన్ని దెబ్బతీయవచ్చు. కానీ, చికిత్సలో పొంచి ఉన్న ప్రమాదాలను తెలుసుకుని పేషంట్లు మనోధైర్యంగా ఉండాలి. నిజానికి ఇది చాలా దయనీయమైన స్థితి. జీవితంలో ఇతరుల సానుభూతి, సహకారం భారీగా కావల్సిన సమయంలో ఏకాంతంగా ఉండాల్సి రావడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి భావాలు మీకు వచ్చిన వెంటనే ఆసుపత్రి సిబ్బందికి చెప్పాలి. వారు పేషంట్లకు సాంత్వన చేకూరే మాటలు చెబుతారు. మంచి పుస్తకాలు ఈ సమయంలో మంచి నేస్తాలు. ఒంటరి తనాన్ని దూరం చేస్తాయి. టివి, రేడియో, సంగీతం వినిపించే టేప్ రికార్డర్ వంటివి కూడా ఒంటరి తనాన్ని దూరం చేస్తాయి.

పేషంట్లలో భిన్న మనస్తత్వాలు ఉన్నవారు ఉంటారు. కొంతమంది తమకు వచ్చిన వ్యాథి, జరుగుతున్న వైద్యం గురించి సంపూర్తిగా తెలియాలని కోరుకుంటారు. మరికొందరు చూచాయిగా తెలిస్తే చాలని భావిస్తారు. మరి కొందరికి నిజాలను జీర్ణించుకునే శక్తి ఉండదు. ఇటువంటి వారిని మనస్తత్వాలకు అనుగుణంగా మాత్రమే నిజాలు చెప్పాలి. ఏ పేషంట్ కు ఎంతవరకు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అనేది ఒక కళ. దీని ప్రధాన ఉద్దేశం రోగికి మానసిక ధైర్యం కలిగించడమే అని చుట్టు పక్కల వారు గమనించాలి. ఎవరు పడితే వారు పేషంట్లుకు సలహాలు ఇవ్వకూడదు. కేవలం అనుభవజ్ఞులైన, శిక్షితులైన సిబ్బంది మాత్రమే పేషంట్లకు సలహాలు ఇవ్వగలరని ఆసుపత్రికి వెళ్లే వారు అంతా గుర్తుంచుకోవాలి. తమకు తెలిసిన అసంపూర్తి విషయాలు ఇతరులతో సొల్లువాగుడు ద్వారా చెప్పరాదు. ఏ సమాచారాన్ని ఏవిధంగా పేషంట్లు అర్థం చేసుకుంటారో సామాన్యులకు తెలియదు. కేవలం ఆసుపత్రి సిబ్బందికి మాత్రమే అది తెలుసు. కనుక సందేహాలను కేవలం ఆసుపత్రి సిబ్బంది ద్వారా మాత్రమే నివృత్తి చేసుకోవాలి.

తరువాయి భాగం రేపు ఇదేచోట

గడచిన భాగాలు

కేన్సర్ “జాలం” –1- మూడులోకాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –2- నాన్న ప్రేమ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –3- పునర్జన్మ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –4- నాన్నలేనిలోటు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –5- తెరచాటు యుద్ధాలు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –6- దొంగదెబ్బలు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –7- తోడేళ్ల దాడి– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –8- పరాన్నజీవులు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –9- పంచాగ్నిమధ్యం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –10- ఉత్తర దక్షిణాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –11- పడగనీడలో పెళ్లిళ్లు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –12- చాటింగ్ చీటింగ్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –13- సైబర్ ఫ్రాడ్– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –14-సైబర్ జాలం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –15-ఇ.ప్రేమ జాలం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –16- సైబర్ ముఠాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –17- సైబర్ కాప్స్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –18- విశృంఖలత్వం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –19- మారుమనువు పుట్టలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –20- ఆన్ లైన్ పెళ్లిళ్లు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –21- పెళ్లికూపాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –22- ఇష్టానిష్టాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –23- లింఫోమా కేన్సర్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –24- జీవించేకళ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –25- నమ్మకం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –26- రథసారథి – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –27- రియల్ మాఫియా – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –28- భూ బకాసురులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –29- చివరిపోరు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –30- మెడలో పాము – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –31- కలుపుమొక్కలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –32- ఉక్కుమనిషి – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –33- కాగితపు పెళ్లాం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –34- ఉన్నతశిఖరాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –35- ధైర్యం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –36- లింఫోమా – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –37- నాన్ హెడ్జికిన్ లింఫోమా – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –38- సైడ్ ఎఫెక్టులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –39- ఏది మంచి? ఏది చెడు? – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –40- లాభనష్టాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –41- రక్తవ్యవస్థ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –42- రక్తపరీక్షలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –43-వైద్య నివేదికలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –44-రక్తదానం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –45-ఇమేజింగ్ టెస్టులు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –46- సిటి స్కానింగులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –47- పెట్ స్కానింగు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –48- మెడికల్ రికార్డులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –49- పరిశుభ్రత – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –50- అలసట జయించండి – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –51- మబ్బుతెరలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –52- మానసికగ్రహణం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –53- నిద్రమాంద్యం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –54- నొప్పి నివారణ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –55- రేడియో థెరపీ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –56- కనిపించని కిరణాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –57- రేడియో థెరపీ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –58- చికిత్స పథక రచన – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –59- రేడియో థెరపీ రకాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –60- రేడియో థెరపీ సైడ్ ఎఫెక్టులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –61- రేడియోథెరపీ జుట్టురాలుట – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –62- దీర్ఘకాలిక నష్టాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –63- చోటును బట్టీ సైడ్ ఎఫెక్టు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –64- నిర్లక్ష్యం వద్దు – ఏలూరిపాటి

ఒక ముఖ్య ప్రకటన : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు,అంశాలకు, సమాచారాలకు, నివేదికలకూ నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది. ఇక్కడ ఇస్తున్న సమాచారాలు వైద్యనిపుణుల సలహాలు,సంప్రదింపులకు ప్రత్యామ్నాయాలు కాదు. చదువరులు తమకు లేక తమవారికి ఉన్న కేన్సర్ వ్యాధులను వైద్య నిపుణుల చేత పరీక్షింపచేయించుకుని నిర్ధారించుకుని తీరవలెను. వారికి వచ్చే సందేహాలకు వైద్యులు ఇచ్చే సలహాలు, చేసే సూచనలు నిర్ద్వందంగా పాటించవలెను. ఇక్కడ ప్రచురిస్తున్న అభిప్రాయాలు, ఆలోచనలు,అవలోకనాలు మొదలైనవి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పాత్రికేయ రంగ జాగ్రత్తలతో ఇస్తున్నాను. ఆయా రంగాల నిపుణుల సలహాల మేరకు, ప్రకటనల మేరకు,సమాచారాల మేరకు దీని రూపరచన జరిగింది. అయినా, ఇందులో ఉన్న లోటుపాట్లను, లోపాలను, తప్పొప్పులను ఇతరాలను నా దృష్టికి తీసుకువస్తే సహేతుకమైనవాటిని సవరించడానికి సిద్ధం. ఇక్కడ ఉన్న ఏ విధమైన సమాచారమైన మీ వైద్యులు చెప్పేదానికి విరుద్ధంగా ఉంటే వైద్యబృందం చెప్పేదే తుదకు అంగీకార యోగ్యమైనదిగా గ్రహించగలరు.

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ప్రకటనలు