3-058-1f

రేడియోథెరపీ విజయవంతం కావాలంటే పక్కా ప్లానింగ్ జరగాలి. ప్లానింగే రేడియోథెరపీ విజయాన్ని నిర్ణయిస్తుంది. రేడియో ధార్మిక కిరణాలు కేన్సర్ కంతులపై కచ్చితంగా గురిపెట్టడానికి ప్లానింగ్ కీలకమైన పాత్ర పోషిస్తుంది.

********                     *****************                   **************

రేడియేషన్ చికిత్సలో రేడియో ధార్మిక శక్తి ఉన్న కిరణాలను కేన్సర్ సోకిన శరీర భాగాలపై ప్రసరిస్తారు. శక్తిమంతమైన కిరణాలు కేన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి. కిరణాలు ఒక వేళ మంచి కణాలపై పడితే అవి కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. కనుక కిరణాలను కచ్చితంగా కేన్సర్ కణాలపై మాత్రమే పడేటట్లు ప్రయోగిస్తారు. ఇలా చేయాలంటే, కేన్సర్ సోకిన భాగాలను పట్టి బంధించాలి. ఇలా పట్టి బంధించడానికి మౌల్డులు ఉపయోగిస్తారు. మౌల్డుల సాయంతో రేడియేషన్ ఇచ్చే శరీర భాగాలు కదలకుండా చేస్తారు. దీని వల్ల శరీర భాగాలు సరైన పొజిషన్ లోకి వస్తాయి. మౌల్డులు ప్లాస్టిక్ జల్లెడల మాదిరిగా ఉంటాయి.

రేడియేషన్ చికిత్సలో ముందుగా సిటి స్కాన్ లేదా ఎంఆర్ స్కాన్ చేస్తారు. స్కానింగ్ లో కేన్సర్ సోకిన భాగాలను 3డిలో చిత్రీకరిస్తారు. థెరపీ రేడియోగ్రాఫర్లు కేన్సర్ ఉన్న భాగాల కొలతలు తీసుకుంటారు. వీటిని కంప్యూటర్ కు అందిస్తారు. కంప్యూట ర్లు రేడియేషన్ ప్లానింగ్ ను చేస్తాయి. ప్లానింగ్ ను వైద్యులు నిర్ధారిస్తారు. దశలో వైద్యులను ప్లానింగ్ వివరాలను గురించి అడిగి తెలుసుకోవచ్చు. దీని తరువాత ఇంక్ మార్కింగ్ లను చేస్తారు. ఇవి మౌల్డ్ మీద లేదా చర్మం మీద సిరాతో చేస్తారు. ఇవి రేడియోగ్రాఫర్లకు మార్గనిర్దేశం చేస్తాయి. ఒక వేళ చర్మం మీద చేస్తే సిరా గుర్తులు చెరిగిపోకుండా ఎలా చూసుకోవాలో రేడియోషన్ సిబ్బంది సూచనలు ఇస్తారు. వీటిని ఎటువంటి పరిస్థితుల్లోను మనం తిరిగి రాయకూడదు. కొన్ని సందర్భాల్లో పచ్చబొట్టు వంటి వాటిని కూడా వేస్తారు. కొన్ని గుర్తులు స్థిరంగా ఉండిపోతాయి. దీని వల్ల భవిష్యత్తులో రేడియేషన్ జరిగినట్లు రేడియోగ్రాఫర్లు తెలుసుకునే వీలు కలుగుతుంది.

వైద్య విధానాల్లో రేడియోథెరపీకి విలక్షణమైన విధానం. పద్ధతిలో వైద్యం ప్రారంభం కావడానికి ముందు చాలా ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ కోసం కొన్ని సార్లు ఆసుపత్రి చుట్టు తిరగాల్సి ఉంటుంది. రేడియోథెరపీ విజయవంతం కావాలంటే పక్కా ప్లానింగ్ జరగాలి. ప్లానింగే రేడియోథెరపీ విజయాన్ని నిర్ణయిస్తుంది. రేడియో ధార్మిక కిరణాలు కేన్సర్ కంతులపై కచ్చితంగా గురిపెట్టడానికి ప్లానింగ్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యవంతమైన కణాలకు అతి తక్కువ నష్టం కలిగేలా జాగ్రత్తలు తీసుకునేది ప్లానింగ్ లోనే. ప్లానింగ్ జరిగిన దాదాపు రెండు వారాల తరువాత రేడియోథెరపీ మొదలు అవుతుంది. కొన్ని కొన్ని సందర్భాలలో రేడియేషన్ చికిత్స మొదలు కావడానికి ఇంకా తక్కువ సమయం పట్ట వచ్చు, లేదా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు.

రేడియోషన్ చికిత్సలో దయచేసి కదలకండిఅనే సూచన అతి ఎక్కువ సార్లు వినిపిస్తుంది. చికిత్స జరుగుతున్నప్పుడు పేషంట్ కదలడం వల్ల రేడియో ధార్మిక కిరణాలు గురితప్పి మంచి కణాలపై పడే ప్రమాదం ఉంది. ప్రమాదాలను నివారించడానికి పొజిషనింగ్ ను చికిత్సకారులు పాటిస్తారు. ఇందు కోసం మౌల్డ్ లు ఉపయోగిస్తాయి. సాధారణంగా, తల, మెడ కేన్సర్ సోకినప్పుడు తలకు మౌల్డులు తయారు చేసి అమర్చుతారు. అవసరమైతే కాలు, చేయి ఇతర శరీర భాగాలకు కూడా మౌల్డులు తయారు చేస్తారు. చికిత్స జరిగేటప్పుడు పిల్లలు కదిలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక పిల్లలకు రేడియోథెరపీ చేయాల్సి వస్తే తప్పని సరిగా మౌల్డులు తయారు చేస్తారు. ఇవి పిల్లలను పట్టి ఉంచుతాయి. మౌల్డుల మీద అవసరమైన గుర్తులను చికిత్సకారులు సిరా సాయంతో పెట్టుకుంటారు. మౌల్డులను పెర్స్ పెక్స్ లేదా ప్లాస్టిక్ మెష్ విధానాలలో తయారు చేస్తారు. పెర్స్ పెక్స్ మౌల్డు కోసం తడి ప్లాస్టర్ బాండేజ్ ఉపయోగిస్తారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్లాస్లిక్ మెష్ మౌల్డు వాడతారు. మౌల్డు తయారు అయిన తరువాత దాదాపు చికిత్సకు అంతా సిద్ధమైనట్టే.

రేడియేషన్ చేసే యంత్రాలు అతి భారీగా ఉంటాయి. ఇవి చేసే శబ్దాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిని చూస్తే పెద్దలు కూడా నోరువెళ్లబెట్టటం సాధారణం. పల్లెటూరివాళ్లు భయపడడం కూడా కొన్ని సందర్భాలలో ఉంటుంది. అయితే వీటన్నింటినీ పేషంట్లు అధిగమించాలి. ప్రతిరోజు చికిత్స జరిగేది కేవలం పది పదిహేను నిమిషాలు పాటు మాత్రమే అయినా, పేషంట్ సంపూర్తిగా రిలాక్స్ కావాలి. చికిత్స సమయంలో కలుగుతున్న సందేహాలు, భయాలు రేడియేషన్ సిబ్బందికి చెప్పి నివృత్తి చేసుకోవాలి. వైద్య శాస్ర్తంలోని అన్ని చికిత్స విధానాల్లోనూ రేడియేషన్ చికిత్సే మాత్రమే నొప్పి రహిత చికిత్స. రేడియేషన్ సిబ్బంది చాలా వేగంగా పనిచేస్తుంటారు. అక్షరాల దాదాపు ఉరుకులు పరుగులతో పనిచేస్తారు. వాళ్ల పరుగులు చూసి పేషంట్లు కంగారు పడాల్సిన అవసరం లేదు. విధంగా వాళ్లు పరిగెత్తడం కేవలం ప్రతి పేషంటు చికిత్సకు పట్టే సమయాన్ని కాపాడుకోవడానికే. మౌల్డు అమర్చడం, పేషంటు పడుకున్న బల్ల ఎత్తును సరిచేయడం, యంత్రానికి అనుగుణంగా పేషంటును అమర్చడానికి రేడియేషన్ సిబ్బంది సమయంలో అధికభాగం పడుతుంది. రేడియేషన్ ఇచ్చే గదిలో పేషంటు ఒక్కరే ఉంటారు. అయితే రేడియేషన్ సిబ్బంది వేరే గదిలో నుంచి కొన్ని ప్రత్యేకమైన కెమేరాల ద్వారా పేషంటును నిశితంగా పరిశీలిస్తుంటారు, కనుక పేషంట్లు ధైర్యంగా ఉండవచ్చు. గది అతి తక్కువ కాంతిమంతంగా ఉంటుంది. సాధారణ ఎసి కన్నా ఎక్కువ చల్లగా ఉంటుంది. విధమైన భయం కలిగినా చేయి పైకి ఎత్తితే రేడియేషన్ సిబ్బంది వెంటనే స్పందించి పరిగెత్తుకు వస్తారు.

 తరువాయి భాగం రేపు ఇదేచోట

గడచిన భాగాలు

కేన్సర్ “జాలం” –1- మూడులోకాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –2- నాన్న ప్రేమ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –3- పునర్జన్మ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –4- నాన్నలేనిలోటు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –5- తెరచాటు యుద్ధాలు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –6- దొంగదెబ్బలు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –7- తోడేళ్ల దాడి– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –8- పరాన్నజీవులు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –9- పంచాగ్నిమధ్యం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –10- ఉత్తర దక్షిణాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –11- పడగనీడలో పెళ్లిళ్లు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –12- చాటింగ్ చీటింగ్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –13- సైబర్ ఫ్రాడ్– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –14-సైబర్ జాలం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –15-ఇ.ప్రేమ జాలం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –16- సైబర్ ముఠాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –17- సైబర్ కాప్స్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –18- విశృంఖలత్వం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –19- మారుమనువు పుట్టలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –20- ఆన్ లైన్ పెళ్లిళ్లు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –21- పెళ్లికూపాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –22- ఇష్టానిష్టాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –23- లింఫోమా కేన్సర్ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –24- జీవించేకళ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –25- నమ్మకం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –26- రథసారథి – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –27- రియల్ మాఫియా – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –28- భూ బకాసురులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –29- చివరిపోరు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –30- మెడలో పాము – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –31- కలుపుమొక్కలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –32- ఉక్కుమనిషి – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –33- కాగితపు పెళ్లాం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –34- ఉన్నతశిఖరాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –35- ధైర్యం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –36- లింఫోమా – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –37- నాన్ హెడ్జికిన్ లింఫోమా – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –38- సైడ్ ఎఫెక్టులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –39- ఏది మంచి? ఏది చెడు? – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –40- లాభనష్టాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –41- రక్తవ్యవస్థ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –42- రక్తపరీక్షలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –43-వైద్య నివేదికలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –44-రక్తదానం– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –45-ఇమేజింగ్ టెస్టులు– ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –46- సిటి స్కానింగులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –47- పెట్ స్కానింగు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –48- మెడికల్ రికార్డులు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –49- పరిశుభ్రత – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –50- అలసట జయించండి – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –51- మబ్బుతెరలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –52- మానసికగ్రహణం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –53- నిద్రమాంద్యం – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –54- నొప్పి నివారణ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –55- రేడియో థెరపీ – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –56- కనిపించని కిరణాలు – ఏలూరిపాటి

కేన్సర్ “జాలం” –57- రేడియో థెరపీ – ఏలూరిపాటి

ఒక ముఖ్య ప్రకటన : ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఇవి ఎవరైనా మరణించినా లేక జీవించిన వ్యక్తులను లేదా సంస్థలను పోలినట్లైతే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నా జీవితంలోని కొన్ని యదార్థ ఘటనలకు, సత్యాలకు,అంశాలకు, సమాచారాలకు, నివేదికలకూ నాటకీయత జోడించి, సున్నితమైన కేన్సర్ సమస్యల పట్ల, నిర్లక్ష్యంగా ఉంటున్న సమాజలోపాలను చూపడానికి,  పరిష్కారమార్గాలు కనుగొనడానికి చేస్తున్న అతిపెద్ద ప్రయత్నం. రెండు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మూడేళ్లు చేసిన పరిశోధనాత్మక నివేదికకు ధారావాహిక రూపమే ఇది. ఇక్కడ ఇస్తున్న సమాచారాలు వైద్యనిపుణుల సలహాలు,సంప్రదింపులకు ప్రత్యామ్నాయాలు కాదు. చదువరులు తమకు లేక తమవారికి ఉన్న కేన్సర్ వ్యాధులను వైద్య నిపుణుల చేత పరీక్షింపచేయించుకుని నిర్ధారించుకుని తీరవలెను. వారికి వచ్చే సందేహాలకు వైద్యులు ఇచ్చే సలహాలు, చేసే సూచనలు నిర్ద్వందంగా పాటించవలెను. ఇక్కడ ప్రచురిస్తున్న అభిప్రాయాలు, ఆలోచనలు,అవలోకనాలు మొదలైనవి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పాత్రికేయ రంగ జాగ్రత్తలతో ఇస్తున్నాను. ఆయా రంగాల నిపుణుల సలహాల మేరకు, ప్రకటనల మేరకు,సమాచారాల మేరకు దీని రూపరచన జరిగింది. అయినా, ఇందులో ఉన్న లోటుపాట్లను, లోపాలను, తప్పొప్పులను ఇతరాలను నా దృష్టికి తీసుకువస్తే సహేతుకమైనవాటిని సవరించడానికి సిద్ధం. ఇక్కడ ఉన్న ఏ విధమైన సమాచారమైన మీ వైద్యులు చెప్పేదానికి విరుద్ధంగా ఉంటే వైద్యబృందం చెప్పేదే తుదకు అంగీకార యోగ్యమైనదిగా గ్రహించగలరు.

https://yeluripati.wordpress.com/

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ప్రకటనలు