మిత్రులారా!

రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి నిర్మించిన, జి వి అయ్యర్ దర్శకత్వం వహించిన వివేకానంద సినిమా ఈ క్రింది లింకులో  ఉంది. ఇప్పటికి 14 వేల మంది పైగా దీన్ని దిగుమతి చేసుకున్నారు. ఆర్కైవ్ డాట్ ఆర్గ్ సైట్ లో సాధారణంగా కాపీరైట్లు లేని పుస్తకాలు, చిత్రాలు, చలన చిత్రాలు మాత్రమే ఉంచుతారు. కానీ, దీన్ని కూడా ఎవరో ఉంచారు. కమ్యూనిటీ విభాగంలో దీన్ని చేర్చారు. ఇదే సైట్ లో కొన్ని ఇతర వ్యాపార సినిమాలు కూడా ఉండడం గమనార్హం. ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించిన సైటు ఇటువంటి పనులతో వివాదాస్పదం అవుతోంది. అయితే, ఇది దూరదర్శన్ లో ప్రసారమైన భాగాలను వ్యక్తిగతంగా రికార్డింగు చేసి అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో ఉన్న ఈ సినిమాను ఇప్పటికి 14 వేల మంది దిగుమతి చేసుకోవడం, స్వామి వారి మీద భక్తిని తెలియ చేస్తోంది. ఈ సినిమాకు ఉన్న డిమాండ్ ను కూడా తెలియచేస్తోంది. చిత్ర నాణ్యత చాలా తక్కువగా ఉంది. వీడియో, ఆడియో నాసిరకంగా ఉంది. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమా చూడని వారు దీన్ని చూడడానికి ఇష్టపడుతున్నట్లు అక్కడ రాసిన వ్యాఖ్యల వలన తెలుస్తోంది.

  • ఏలూరిపాటి

https://archive.org/details/SwamiVivekananda1995-FullHindiFilm

SVfilm